నూజీవీడు ( జనస్వరం ) : రైతుల సమస్యలపై నిత్యం పోరాడుతూ వారి కోసం ఆర్ధిక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి అండగా నిలబడుతున్న అధినేత పవన్ కళ్యాణ్ గారే అసలైన రైతుబంధవుడు – నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు. ఆయన మాట్లాడుతూ రైతు లేనిదే మనిషి లేడు దేశానికి రైతే వెన్నుముక .రైతు కష్టపడితే తప్ప మన కంచంలోకి అన్నం రాదు. మానవాళిని బ్రతికించే వృత్తిని ఎన్నుకున్న రైతన్నలకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని ముసునూరు మండలంలోని రమణక్కపేట, అక్కిరెడ్డిగూడెం గ్రామాలలో, నూజివీడు మండల దిగవల్లిలో పాశం నాగబాబు ఆధ్వర్యంలో ఉప్పే శ్రీనివాస్ గారి వ్యవసాయ క్షేత్రంలో జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి స్థానిక రైతులకు, వ్యవసాయ కూలీలకు స్వీట్స్ పంచారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అన్నదాతల మేలు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, తన సొంత కష్టార్జితంతో ఆత్మహత్య చేసుకున్న 3000 కౌలు రైతు కుటుంబాలకు 30కోట్ల ఆర్థిక భరోసా అందిస్తూ వారికి జీవితంపై నమ్మకం కలిగిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని కౌలు రైతుల బంధావుడుగా కొనియాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుందని పరిస్థితుల అధ్వానంగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రైతులను తేమ శాతం పేరుతో అనేక ఇబ్బందులూ పెడుతూ మిల్లర్ల చుట్టూ తిరిగే పరిస్థితిని నెలకొల్పి రైతులను కన్నీటిపాలు చేస్తున్నారు ఒక వైపు చేతి వరకు వచ్చిన పంట నోటి వరకు రావడం లేదని, అకాల వర్షాలు తుఫాను వలన రైతాంగం నష్టపోతుందని జనసేన అధికారంలోకి వస్తేనే రైతులను సుభింక్షంగా ఉండేలా చేస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చేకూరి సాయి, ఉప్పే శ్రీను,స్వామి,శేషు, సత్యనారాయణ, నాగేశ్వరరావు,వేట త్రినాధ్,కిషోర్, సతీశ్, వీర మహిళలు లక్ష్మీ, పార్వతీ, నాగేశ్వరమ్మ, జనసైనికులతో పాటు స్థానిక రైతులు, కూలీలు పాల్గొన్నారు.