
టెక్కలి, (జనస్వరం) : గ్రామస్థాయిలో జనసేన బలోపేతమే ధ్యేయంగా కోటబొమ్మాలి మండలంలోని చిన్న హరిచంద్రపురం గ్రామంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం జరిగినది. ఈ సమావేశంలో టెక్కలి జనసేన పార్టీ ఇంచార్జ్ కణితి కిరణ్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలను వివరించారు. అలాగే జనసేన పార్టీ సభ్యత్వ కిట్లను పంపిణి చేసారు. త్వరలోనే గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి గ్రామాల్లో జనసేనను బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హరిశ్చంద్రపురం పంచాయతీలోని సాలిపేట, ఉప్పారపేట, బాపన్నపేట గ్రామ జనసైనికులు, హరిచంద్రపురం-2 MPTC అభ్యర్థి ఇలపండా రమేష్, కొత్తూరు హరి, చిరంజీవి, త్రివేణి, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.