ఎమ్మిగనూరు, (జనస్వరం) : చేనేతల అభివృద్దే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర చేనేత వికాస్ చైర్మన్ చల్లపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా చేనేత కుటుంబాలను పరామర్శించిన నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గౌడ్ అధ్యక్షతన స్థానిక పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేతల ఎంతో గుర్తింపు ఉన్న ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేతల మనుగడ ప్రశ్నగా మారడం చాలా బాధాకరం మాచాని సోమప్ప లాంటి మహనీయులు పుట్టిన ఎమ్మిగనూర్ నియోజకవర్గంలో చేనేతలకు గుర్తింపు లేకపోవడం సరైన ధర ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని విమర్శించారు. పేరుకు మాత్రమే చేనేతలకి అండగా ఉంటామని ప్రభుత్వాలు ఉత్తుత్తి హామీలు ఇస్తూ పథకాలు ప్రకటిస్తున్నారని అర్హులైన చేనేతలకి సరిగా అందడం లేదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని అర్హులైన చేనేతలకు పథకాలు అందే విధంగా గిట్టు పాటు ధరలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో చేనేతలకు అండగా జనసేన పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత వికాస్ ప్రధాన కార్యదర్శి సురేంద్ర రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి కాసా రవి ప్రకాష్, వెంకటేష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com