Logo
Date of Publish : 27 May 2022, 2:47 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ లక్ష్యం అన్నం పెట్టే రైతన్న రాజు కావాలి : జనసేన నాయకులు CG రాజశేఖర్

● టీం పిడికిలి Project 2 గోడ ప్రతులు ఆవిష్కరించిన జనసేనపార్టీ పత్తికొండ నియోజకవర్గ నాయకుడు CG రాజశేఖర్
       పత్తికొండ, (జనస్వరం) : జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గ నాయకుడు CG రాజశేఖర్ మాట్లాడుతూ, CBI దత్తపుత్రుడుకి జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం నుంచి సవాల్. ఇంతవరకు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  ఇప్పటివరకు చెక్కుల పంపిణీ చేసిన వారిలో ఏ ఒక్కరైనా కౌలు రైతులు కాదని నిరూపించే దమ్ము ధైర్యం ఈ సిబిఐ దత్తపుత్రుడుకు ఉందా! అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన 3000 కౌలు రైతులుకు ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 3000 వేల కుటుంబాలకు 30 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని గొప్ప సంకల్పంతో టీమ్ పిడికిలి వారి సౌజన్యంతో గోడ పత్రికలు, ఆటో స్టిక్కర్లు పోస్టర్లు మాకు అందించిన టీం పిడికిలి రాజా మైలరపుకి పత్తికొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాం. సిబిఐ దత్తపుత్రుడు జగన్ రెడ్డి మన రాష్ట్రంలో 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు ఏడు లక్షల రూపాయలు ఎంతమందికి అందించారో శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం నుంచి డిమాండ్ చేశారు. అలాగే ఈ సిబిఐ దత్తపుత్రుడు కౌలు తీసుకొని అప్పులు చేసి అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు సహాయం చేయడు, అప్పులు బాధతో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయలు సహాయం చేస్తూ, వారి కుటుంబాలకు భరోసా ఇస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా సహాయం పొందిన ప్రతి ఒక్కరూ దేవుడిగా పవన్ కళ్యాణ్ ని భావిస్తుంటే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ సీబీఐ దత్తపుత్రుడు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయినా జగన్ రెడ్డికి ఎందుకు అర్థం కావడం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూనే ఉన్నారు . అలాగే రోజురోజుకు జనసేన పార్టీపై ప్రజాదరణ పెరుగుతూ ఉంది. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా ప్రజల విజయాన్ని ఎవరు ఆపలేరు, అడ్డుకోలేరు , జనసేన పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నూరు భాష, ధర్మ తేజ, తిమ్మప్ప, అనిల్, ఇస్మాయిల్, ఎర్రిస్వామి, జానీ, రామ్మూర్తి, హరికృష్ణ, వెంకట్, శివ, జయరామ్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com