హుజూర్ నగర్ ( జనస్వరం ) : నేరేడు చర్ల మండలం, జాన్ పహాడ్ రోడ్ లో గల జేపీఎస్ ఆటో యూనియన్ వారికి జనసేన పార్టీ క్రియాశీలక పార్టీ సభ్యత్వం గురించి హుజూర్ నగర్ నియోజకవర్గ కార్యనిర్వహకులు సరికొప్పుల నాగేశ్వరరావు వివరించారు, ఆయన మాట్లాడుతూ ఈ క్రియాశీలక సభ్యత్వం వలన ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షల రూపాయలు మరియు గాయపడిన వారికి 50 వేల రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. నిత్యం వాహనాలతో ప్రయాణం చేసే వారికి క్రియాశీలక పార్టీ సభ్యత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. అనంతరం వారితో కలిసి జనసేన పార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరించి క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో సాయి, చరణ్, మధు, శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు, నరసింహనాయుడు, జహంగీర్, వెంకటేష్, శ్రీను, అంజి, మరియు జేపీఎస్ ఆటో యూనియన్ సభ్యులు జనసేన సైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com