గుడివాడ ( జనస్వరం ) : గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఏ పార్టీలో లేని విధంగా కార్యకర్తల శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ గారు పెట్టారని అలాంటి నాయకుడికి మేమందరం కార్యకర్తలు అవడం చాలా గర్వంగా ఉందని తెలియజేసినారు. చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయలేనిది మన జనసేన పార్టీ ప్రతి కార్యకర్త బాగుండాలని ఆలోచనతో కేవలం 500 రూపాయలు కడితే ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా జనసేన పార్టీ ఇస్తుందని తెలియజేశారు. గుడివాడ పట్టణంలో అనేక వార్డులు పర్యటించి ఇంటింటికి తిరుగుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆలోచనలు ప్రజలకు తెలియజేయడంతో యువకులు మహిళలు సభ్యత్వం తీసుకున్నారని అన్నారు. అలాగే ఆసక్తి ఉన్న ఉన్నవారు మమ్మల్ని సంప్రదించి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని పార్టీ ని బలపర్చాలి అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని 2024లో ముఖ్యమంత్రి చేసే విధంగా కృషి చేయాలని తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు అయ్యప్ప చరణ్ సురేష్ జగదీష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.