జనసేన పాలకొల్లు ఇంచార్జ్ గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి 16 ఆక్సిజన్ సిలెండర్లు పంపిణీ
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకుని జనసేన పార్టీ పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గుణ్ణం నాగబాబు గారు ఆధ్వర్యంలో పేదోడి ప్రాణానికి జనసేన ప్రాణవాయువు అనే నినాదంతో కొంతేరు, గుంపర్రు, బాడవ గ్రామ జనసైనికుల సహకారంతో ఏర్పాటు చేసిన 11 ఆక్సిజన్ సీలిండర్లు, NRI జనసేన సహకారంతో ఏర్పాటు చేసిన 5 ఆక్సిజన్ సీలిండర్లు మొత్తం 16 ఆక్సిజన్ సీలిండర్లు గుణ్ణం నాగబాబు గారి చేతుల మీదుగా పాలకొల్లు గవర్నమెంట్ కోవిడ్ ఆసుపత్రిలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు, యలమంచిలి,పోడూరు మండలాల అధ్యక్షులు విప్పర్తి ప్రభాకర్, కొడవటి వరబాబు, గుత్తుల నాగరాజు గార్లు, పోడూరు, యలమంచిలి మండలాల ప్రధాన కార్యదర్శులు బండారు రాజేష్, షేక్ అబ్దుల్ మీరావలి గార్లు, నాయకులు తులా రామలింగేశ్వరావు, బెజ్జవరపు నాగరాజు, కొమ్ముల దినేష్, యర్రంశెట్టి నరసింహారావు నియోజకవర్గ గ్రామాల జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.