పీలేరు ( జనస్వరం ) : నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ బెజవాడ దినేష్ గారు మాట్లాడుతూ గత నెల 31న పీలేరు లో ఆటో డ్రైవర్ను కొందరు దుండగులు సైనైడ్ ఇంజక్షన్ తో పొడిచి చంపారు. నిందితుల గురుంచి పోలీసు వారు ఎంక్వయిరీ చేయగా ప్రధాన నిందితుడు వార్డు వాలంటీర్ కిషోర్ అని తేలింది. హత్యకు కారణాలు వెతగ్గా హత్య చేయబడ్డ అతను పొట్ట చేత పట్టుకొని బ్రతుకు దెరువు కోసం కువైట్ కి పోగా ఒంటరి మహిళా అయిన తన భార్యని వాలంటీర్ కిషోర్ లోబరచుకొని తన కామ వాంఛ తీర్చుకోసాగాడు. ఇటీవల కువైట్ నుండి భర్త తిరిగి రావడంతో తన కామ వాంచకు అడ్డుతగులుతున్నాడు అని పథకం ప్రకారం గత నెల్ల 31న హత్య చేసారు… రెండున్నర నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు వాలెంటీర్ వ్యవస్థలో లోటుపాట్ల, మంచిచెడులు గురించి వాలెంటీర్లు ఒంటరి మహిళలని ఎలా టార్గెట్ చేస్తున్నారో ప్రశ్నించినందుకు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు బొమ్మలు తగలుబెట్టారు. మరి పీలేరులో ఆ రోజు రోడ్డు ఎక్కిన వాలంటీర్లు ఇపుడు ఏమంటారు ??? ఆ హత్యలో రోడ్డు ఎక్కిన వాలెంటీర్లకి భాద్యత ఉంది అని ఒప్పుకుంటారా? లేక మా పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్, రెడ్డప్ప, పవన్, మహేష్, మరియు తదితరులు పాల్గొన్నారు .