ప్రజల పక్షానే ‘జనసేన”
– జన సేన దెబ్బకు దిగొచ్చిన మంత్రి బాలినేని
– ఒంగోలులో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు, తారు
– ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అధినేతపై చవకబారు విమర్శలు
– జగన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనం
– స్త్రీ రక్షణ ప్రశ్నార్ధకం, పౌరుడు స్వేచ్ఛకు సంకెళ్ళు
– భవిష్యత్తులో జనసేన సత్తా చూపిస్తాం
– మీడియాతో జనసేనా పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్
ప్రకాశం, (జనస్వరం) : జనసేన దెబ్బకు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టిందని, భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యలను విస్మరిస్తే జనసేన సత్తా ఏంటో చూపిస్తామని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ హెచ్చరించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఇటీవల ఏపిలో రోడ్ల స్థితి గతులపై స్పందించిన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజల నుండి విశేష స్పందన లభించిందన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన దెబ్బకు దిగొచ్చారన్నారు. రెండున్నరేళ్ళ పరిపాలన కాలంలో ప్రజల సమస్యలపై దృష్టి సారించిన మంత్రి, నేడు జనసేన పోరాటంతో సమస్యలపై దృష్టి పెట్టారన్నారు. ఒంగోలులో గుంతల రోడ్లను పూడ్చి తారు రోడ్డులు వేయడం వెనుక జనసేన పోరాట పటిమే అన్నారు. రెండున్నరేళ్ళ కాలంలో వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిందేమి లేదన్నారు. ఎప్పటికైనా ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది జనసేన పార్టీ అని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై కొంత మంది చవకబారు విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. వైకాపా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు సంగతేంటని ప్రశ్నిస్తుంటే, వ్యక్తిగత విమర్శలు ఈ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు సంగతేంటని ప్రశ్నిస్తుంటే, వ్యక్తిగత విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో సామాన్య పౌరుడు నుండి ప్రజాప్రతినిధి వరకు రక్షణ లేకుండా పోయిందన్నారు. సొంత బాబాయి హత్య కేసు తేల్చకుండా తాత్సారం చేయడం, చిన్న చిన్న సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించడం వెనుక మర్మం ఏమిటని అన్నారు. ఆడ బిడ్డలకు రక్షణ, భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. తాడేపల్లి ప్యాలెస్ వదిలి రాలేని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజా సమస్యలు ఎలా అర్థమౌతాయని ప్రశ్నించారు. ప్రజల్లోకి వచ్చి మళ్లీ పాదయాత్రలు చేయండి. అప్పుడు మీ పాలన వలన ప్రజలంతా ఎంత అష్ట కష్టాలు పడుతున్నారో తెలుస్తోందన్నారు. విజయవాడలో డ్రగ్స్ కు సంబంధించి వైకాపా నేత పేరు బయటకు రాకుండా పక్కదారి పట్టించేందుకు, పవన్ కళ్యాణ్ పై చవక బారు విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రతీ ఒక్క రూపాయి పవన్ కళ్యాణ్ కష్టపడి సంపాదించుకుంటున్నారన్నారు. హీరోగా నటించగా వచ్చిన డబ్బులోనే కొంత సేవా కార్యక్రమాలు చేయడం అందరికీ స్పూర్తిదాయకం అన్నారు. ఇవేమి పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ పై చవకబారు విమర్శలు చేయడం తగదన్నారు. భవిష్యత్తు జనసేన పార్టీదేన్నారు. వైకాపా పాలనకు రాష్ట్ర ప్రజలంతా విసిగిపోయారన్నారు. ప్రజలంతా ప్రత్యామ్నాయ పార్టీ జనసేన వైపు చూస్తున్నారన్నారు. భవిష్యత్తులో జనసేన దుమ్ము రేపుతోందని, అధికార పార్టీ వైకాపాకి దిబ్బతిరిగేలా సమాధానం చెబుతామని జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు కార్పొరేటర్ మలగా రమేష్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.