
రాజంపేట, (జనస్వరం) : రాష్ట్రంలో ఎక్కడ విపత్తు వచ్చినా సహాయం చేయడంలో జనసేన పార్టీ ముందు ఉంటుంది జనసేన నాయకులు రామచంద్రనాయక్, మాదాస్ నరసింహ అన్నారు. గత నెల నవంబర్ 19న రాజంపేట నియోజకవర్గంలో పది గ్రామాల్లో వరదలు వచ్చి భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. వరద బాధితుల సహాయార్థంగా గురుపేటలో శనివారం జనసేన ఎన్నారై సేవాసమితి కువైట్ వారి ఆధ్వర్యంలో వరద బాధితులకు లక్ష 5000 రూపాయలు విలువచేసే మంచాలు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. రాంచందర్ నాయక్ గారు మాట్లాడుతూ వరదల్లో సర్వం కోల్పోయి సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులను అందర్నీ ఆదుకోవడం మనందరి బాధ్యత అన్నారు. అలాగే జనసేన ఎన్నారై సేవాసమితి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. మాదాస్ నరసింహ మాట్లాడుతూ రూపాయి రూపాయి పోగు చేసుకుని కొనుక్కున్న వస్తువులన్నీ కళ్ళముందే నీటిపాలు అయ్యాయని వరద బాధితుల మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది అని, బాధితులతో కలిసి మాట్లాడి వారిని ఓదార్చారు. అలాగే జనసేన ఎన్నారై సేవాసమితి టీం సభ్యులందరికీ ఇంత మంచి సహాయాన్ని వరద బాధితులకు అందించినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకులు ఆకుల నర్సయ్య మాట్లాడుతూ వేల కోట్ల ఆస్తి నష్టం జరిగితే ఈ ప్రభుత్వానికి నిమ్మకునీరెత్తినట్లు లేదని ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ వచ్చి తూతూమంత్రంగా వెళ్లిపోయారని, బాధితులను కనీసం పరామర్శ కూడా చేయకుండా పోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లంపేట జనసేన నాయకులు వరద అన్న గారి ప్రసాద్, నందలూరు జనసేన నాయకులు కొట్టే శ్రీహరి, గురు వి గారి వాసు, శెట్టిపల్లి వెంకట ప్రసాద్, రాజంపేట చిరంజీవి యువత అధ్యక్షుడు గుగ్గిళ్ళ నాగార్జున, గంటా రమేష్, మాదాసు శివ, చింతల వెంకటేష్, శివ బంగారం, పీలేరు గౌస్ మరియు శివ కృష్ణ, టంగుటూరు ఈశ్వర్, సుబ్బు, ప్రశాంత్ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.