
చిత్తూరు ( జనస్వరం ) : పీలేరుకు చెందిన జన సైనికుడు మస్తాన్ రోడ్డు ప్రమాదంలో అతని కాలు తీసివేయడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అతనికి జనసేన ఎన్నారై సేవాసమితి కువైట్ వారు ఆర్థిక సహాయం అందించారు. ఆ సంస్థ అధ్యక్షులు రాచంద్ర నాయక్ ఆధ్వర్యంలో మస్తాన్ కు 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం మరియు మెడికల్ కిట్ మరియు నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. రామచంద్ర నాయక్ మాట్లాడుతూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన గుర్తుకు రావాలి అని మా అధ్యక్షులు వారి అన్న మాటలకు ఈ సహాయమే ఉదాహరణని మస్తాన్ గారికి అన్నివేళలా తోడుగా జనసేన పార్టీ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా దామోదర్ నాయుడు, జనసేన నాయకులు కలప రవి, మున్నా గౌష్, గజేంద్ర, చిరంజీవి, చిరు, పవన్ శివా, దిలీప్ కుమార్, కేశవ మహేష్, ష,పీ అఖిల్, మెహన్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.