
జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో మన జనసేనాని శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్బంగా జరుగుచున్న 30 రోజులు 30 ప్రాంతాల్లో 30 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు కార్యక్రమం చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలం తోటి హరిజనవాడకి చెందిన కుటుంబం తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అత్యవసర పరిస్థితిలో కంచన శ్రీకాంత్ గారిని కోరడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి మనోహర్ ద్వారా వారికి సహాయం అందేలా చేశారు. వారికి 10 వేల రూపాయలు మన సేవా సమితి సభ్యులు మొగిలిశెట్టి మనోహర్ గారు పంపించారు. ఈ సహాయాన్ని మన జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ గారు, రిటైర్డ్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య, హేమంత్, ఆనంద్, క్రాంతి, మునిష్, పార్ధు, చిన్న రాయల్, కీర్తి గారి చేతుల మీదుగా అందించడం జరిగినది.