Logo
Date of Publish : 28 August 2021, 8:16 am
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో 25వ రోజు సేవా కార్యక్రమాలు

                    జనసేన NRI సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా 25వ రోజు కడప జిల్లా, సిద్ధవటం మండలంలోని పరమాత్మ సేవా సమితి ఆశ్రమం నందు జరిగింది. అట్టడుగు వర్గాల మహిళల అభ్యున్నతే జనసేన లక్ష్యంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు మాసోత్సవాల సందర్భంగా 30 రోజులు 30 ప్రాంతాలు 30 సేవా కార్యక్రమాల్లో భాగంగా 25వ రోజు సిద్ధవటం మండలం లోని పరమాత్మ సేవా సమితి ఆశ్రమం నందు జరిగింది. జనసేన జనసేన ఎన్నారై సేవాసమితి కువైట్ వారి ఆధ్వర్యంలో శివ శంకర్, పెంచలయ్య, సుబ్బ నరసయ్య, దాతల సహకారంతో ఆశ్రమంలోని నిరాశ్రయులకు కొత్త బట్టలు పంపిణీ చేసి, 4 బియ్యం ప్యాకెట్లు మరియు నిత్యావసర సరుకులు కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు పండ్రా రంజిత్ కుమార్ గార్ల చేతుల మీదుగా పరమాత్మ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మలిశెట్టి వెంకటరమణ గారికి అందజేశారు. వెంకట రమణ మాట్లాడుతూ జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయని, ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్, ఉపాద్యక్షులు శ్రీ పగడాల అంజన్ కుమార్, నాయకులు శ్రీ కంచన శ్రీకాంత్, శ్రీ మాదాసు నరసింహ, దండు చంద్రశేఖర్, ఇంతియాజ్, నరసింహులు, రామచంద్రనాయక్, చిరంజీవికు తన అభినందనలు తెలిపారు. సిటీ అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ కువైట్ లో ఉంటూ మాతృభూమికి, జనసేన బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్న జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ సభ్యులందరూ ఎంతో‌ ధన్యులని అన్నారు. ఈ కార్యక్రమంలో అతికారి నాగేంద్ర, వంశీకృష్ణ, పుత్తరాజు, కొట్టే రాజేష్, కిరణ్ కుమార్, సాయి కుమార్, పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com