
రైల్వేకోడూరు, (జనస్వరం) : జనసేన NRI సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా 27వ రోజు రైల్వేకోడూరు నియోజకవర్గం వెంకటరెడ్డిపల్లిలో జరిగింది. అభ్యున్నత జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ గౌరవ సభ్యులు శ్రీ బండి హరికృష్ణ, దండు వేణు దాతృత్వంతో కడప జిల్లా రైల్వే కోడూర్ నియోజకవర్గంలోని జనసేన పార్టీ దళిత నాయకులు నగిరిపాటి మహేష్ గారి స్వగ్రామమైన వెంకటరెడ్డి పల్లి అరుంధతి వాడలో 73 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన రైల్వేకోడూరు జనసేన నాయకులు మర్రి రెడ్డి ప్రసాద్, ఉత్తరాది శివ కుమార్, దండు శ్రీనివాసులు చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దండు శ్రీనివాసులు గారు మాట్లాడుతూ నిరుపేద మహిళలకు అండగా ఉండేందుకు జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయని, ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్, ఉపాద్యక్షులు శ్రీ పగడాల అంజన్ కుమార్, నాయకులు శ్రీ కంచన శ్రీకాంత్, శ్రీ మాదాసు నరసింహ, దండు చంద్రశేఖర్, షేక్ అయూబ్ లకు తన అభినందనలు తెలిపారు. జనసేన నాయకులు మర్రిరెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ కువైట్ లో ఉంటూ మాతృభూమికి, జనసేన బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్న జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ సభ్యులందరూ ఎంతో ధన్యులని, ఈ సందర్భంగా దాత లు బండి హరికృష్ణ దండు వేణు గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పార్టీ నాయకులు నగిరి పాటి మహేష్ మాట్లాడుతూ కోవిడ్ లాక్ డౌన్ నాటి నుండి నేటివరకూ అవిశ్రాంతంగా సేవలు అందించడం ఎంతో స్ఫూర్తిదాయకం అని, మొట్టమొదటిసారిగా మా దళితవాడలో ఇలాంటి సేవా సహాయక కార్యక్రమాన్ని జరిపినందుకు దాతలు బండి హరికృష్ణ గారికి మరియు దండు వేణు గోపాల్ గారికి, కువైట్ జనసేన NRI సేవా సమితిలోని ప్రతి ఒక్కరికీ గ్రామ ప్రజల తరుపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి సేవలను కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు దండు శ్రీనివాసులు దండు రాజా, విశ్వనాథ్, నవీన్ కుమార్, గ్రామపెద్దలు యన్.గంగయ్య మరియు జనసేన క్రియాశీలక కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.