Logo
Date of Publish : 26 August 2021, 12:21 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో 21వ రోజు సేవా కార్యక్రమాలు

                         జనసేన NRI సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా 21వ రోజు రాజంపేట నియోజకవర్గం సుండుపల్లిలో నిరుపేదలకు కుట్టుమిషన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన జనసేన నాయకులు ఓబులేష్ రెడ్డి, రాణి ఒంటేరు, రాజా చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుండుపల్లి జనసేన నాయకులు ఓబులేష్ మాట్లాడుతూ నిరుపేద మహిళలకు అండగా ఉండేందుకు జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయని, ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్, ఉపాద్యక్షులు శ్రీ పగడాల అంజన్ కుమార్, నాయకులు శ్రీ కంచన శ్రీకాంత్, శ్రీ మాదాసు నరసింహ, దండు చంద్రశేఖర్, జిగిని ఓబులేష్ కు తన శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా జనసేన వీర మహిళ రెడ్డి రాణి మాట్లాడుతూ కువైట్ లో ఉంటూ మాతృభూమికి, జనసేన బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్న జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ సభ్యులందరూ ఎంతో‌ ధన్యులని, ఈ సందర్భంగా దాత జిగిరి ఓబులేష్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. పార్టీ నాయకులు రాజా మాట్లాడుతూ ‌కోవిడ్ లాక్ డౌన్ నాటి నుండి నేటివరకూ అవిశ్రాంతంగా సేవలు అందించడం ఎంతో స్ఫూర్తిదాయకం అని ఎన్నారై సేవా సమితి కువైట్ వారి‌ సేవలను కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సలీం, నాగేష్, శ్రీనివాసులు, రఫీ, రాయవరం, మణి తదితర జనసైనికులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com