మదనపల్లి కిడ్నీ బాధితుడైన జనసైనికుడికి 10వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ తరుపున పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా 30 రోజులు 30 ప్రాంతాలలో 30 సేవాకార్యక్రమంలో భాగంగా జనసేన ఎన్నారై సేవా సమితి సభ్యులు శ్రీ ఐడియాల మధుసూదన్, ఈతకోట విజయ్ కుమార్ గారి సహకారంతో గత మూడు సంవత్సరాలుగా కిడ్నీ భాధితుడైన జనసేన సైనికుడు S. రమేష్ గారికి 10,000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జనసేన నాయకులు దారం అనిత ద్వారా జనసేన కార్యకర్త S రమేష్ గారికి 10,000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలచిన కడియాల మధుసూదన్, ఈతకోట విజయ్ కుమార్, రామచంద్ర నాయక్, పగడాల అంజన్ కుమార్, శ్రీకాంత్ మరియు జనసేన సేవా సమితి కువైట్ సభ్యులందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో దారం అనిత, మహేష్, దినేష్, దారం హరిప్రసాద్, రమేష్, శ్రీనివాసులు పాల్గొన్నారు.