జనసేన NRI సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా 22వ రోజు చంద్రగిరి నియోజకవర్గం,ఎర్రా వారి పాలెం మండలం చింతగుంట గ్రామంలో ఆది ఆంధ్ర హరిజన వాడలో ఉన్న డప్పు కళాకారులకు డప్పులు అందించారు. సిద్దయ్య వారి బృందానికి 10 డప్పులని చింతగుంట గ్రామస్తులు కంచన రాజగోపాల్ రెడ్డి కుమారుడు కంచన శ్రీకాంత్ గారు దాతృత్వముతో అందచేశారు. ఈ డప్పులని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి, జిల్లా కార్యదర్శి పోటుకూరి ఆనంద్, జనసేన సీనియర్ నాయకులు చింతకాయల కృష్ణయ్య, జాయింట్ సెక్రటరీ బీగాలా అరుణ, మండల నాయకులు ముండ్లపాటి మురళి, జస్వంత్, నాగేంద్ర,శేఖర్, సాయి,రెడ్డి, గజేంద్ర, సునీల్ మరియు జనసేన నాయకుల సమక్షంలో వారికి అందజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీతో కలసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తమకి జనసేన పార్టీ తరపున డప్పులు పంపించిన జనసేన నాయకులు కంచన శ్రీకాంత్ గారికి, జనసేన NRI సేవా సమితి కువైట్ వారికి మరియు జనసేన నాయకులకి ధన్యవాదములు తెలియచేసారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com