
జనసేన NRI సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా 17వ రోజు రైల్వేకోడూరు నియోజకవర్గం పొందలూరు గ్రామంలో 4 కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ గౌరవ సభ్యులు గంటా రమేష్ రమణ ముదిరాజ్ దాతృత్వంతో కొరివి చంద్ర, కొరివి వెంకీ సహాయ సహకారంతో కడప జిల్లా రైల్వే కోడూర్ నియోజకవర్గం పెనగలూరు మండలం పొందలూరు గ్రామంలో 4 కుటుంబాలకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన జనసేన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ ముకరం చాంద్ గారు మరియు చిట్వేలి జనసేన నాయకులు మాదాసు నరసింహులు గారి చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మరియు రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జ్ ముకరం చాంద్ గారు మాట్లాడుతూ నిరుపేద మహిళలకు అండగా ఉండేందుకు జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయని, ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్, ఉపాద్యక్షులు శ్రీ పగడాల అంజన్ కుమార్,నాయకులు శ్రీ కంచన శ్రీకాంత్, శ్రీ మాదాసు నరసింహ, దండు చంద్రశేఖర్, చేపల రమణ, ముదిరాజ్ గంటా రమేష్ లకు తన శుభాకాంక్షలు తెలిపారు. గోవర్ధన్ మాట్లాడుతూ కువైట్ లో ఉంటూ మాతృభూమికి, జనసేన బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్న జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ సభ్యులందరూ ఎంతో ధన్యులని, ఈ సందర్భంగా దాత గంటా రమేష్ చేపల ముదిరాజ్ కొరివి చంద్ర కొరివి వెంకీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. పార్టీ నాయకులు గంటా మహేష్ మాట్లాడుతూ కోవిడ్ లాక్ డౌన్ నాటి నుండి నేటివరకూ అవిశ్రాంతంగా సేవలు అందించడం ఎంతో స్ఫూర్తిదాయకం అని ఎన్నారై సేవా సమితి కువైట్ వారి సేవలను కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిట్వేలి జనసైనికుడు సువారపూ హరి రాయల్ జనసైనికులు పుచ్చకాయల పాపయ్య, గుత్తి గోవర్ధన్, బుకాయపల్లిసుబ్రమణ్యం, గోపవరం సుబ్బానర్సయ్య, గంటా మహేష్, బైరిశెట్టి వెంకటయ్య, మల్లిరెడ్డి యనాది రెడ్డి, పెనుబడి శ్రీనాధ్ రెడ్డి, పెనుబడి మోహన్ రెడ్డి, కనుపర్తి కోటీశ్వర్ రెడ్డి, మిగడ నవీన్ రెడ్డి, గోపవరంమధు, వల్లెల సురేష్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు జనసేన శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.