
జనసేన NRI సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా 15వ రోజు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ గౌరవ సభ్యులు శ్రీ షేక్ అయూబ్ దాతృత్వంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలంలో 45 కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన జనసేన జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు మరియు ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీధర్ గారు మరియు జనసేన చిన్నా చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొట్టే వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ నిరుపేద మహిళలకు అండగా ఉండేందుకు జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయని, ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్, ఉపాద్యక్షులు శ్రీ పగడాల అంజన్ కుమార్, నాయకులు శ్రీ కంచన శ్రీకాంత్, శ్రీ మాదాసు నరసింహ, దండు చంద్రశేఖర్, షేక్ అయూబ్ లకు తన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీధర్ గారు మాట్లాడుతూ కువైట్ లో ఉంటూ మాతృభూమికి, జనసేన బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్న జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ సభ్యులందరూ ఎంతో ధన్యులని, ఈ సందర్భంగా దాత షేక్ అయూబ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. పార్టీ నాయకులు జనసేన చిన్న మాట్లాడుతూ కోవిడ్ లాక్ డౌన్ నాటి నుండి నేటివరకూ అవిశ్రాంతంగా సేవలు అందించడం ఎంతో స్ఫూర్తిదాయకం అని ఎన్నారై సేవా సమితి కువైట్ వారి సేవలను కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు ఈ కార్యక్రమంలో మర్రిపాడు జనసైనికులు పాల్గొన్నారు.