Logo
Date of Publish : 15 August 2021, 9:43 am
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో 12వ రోజు సేవా కార్యక్రమాలు

                         జనసేన NRI సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా 12వ రోజు రాజంపేటలో దండు రమేష్ ఆధ్వర్యంలో 60 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ గౌరవ సభ్యులు దండు సురేష్ దాతృత్వంతో రాజంపేటలో డంపింగ్ యార్డ్ నిరుపేద కుటుంబాలకు ఉచితంగా పంచదార, కందిపప్పు, గోధమపిండి, మినుములు, ఇడ్లిరవ్వ, నూనె, పెద్ద ఉల్లిపాయలు తదితరులు 9 రకాల నిత్యావసర వస్తువులను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జ్ ముఖరం చాంద్ గారు, దండు రమేష్ చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ముఖరం చాంద్ గారు మాట్లాడుతూ నిరుపేద మహిళలకు అండగా ఉండేందుకు జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయని, ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్, ఉపాద్యక్షులు శ్రీ పగడాల అంజన్ కుమార్, నాయకులు శ్రీ కంచన శ్రీకాంత్, శ్రీ మాదాసు నరసింహ, దండు చంద్రశేఖర్, దండు సురేష్ లకు తన అభినందనలు తెలిపారు. లాయర్ కర్ణాకర్ మాట్లాడుతూ కువైట్ లో ఉంటూ మాతృభూమికి, జనసేన బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్న జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ సభ్యులందరూ ఎంతో‌ ధన్యులని, సహాయ దాత కి దండు సురేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దండు రమేష్, లాయర్ కర్ణాకర్, దేవి శెట్టి, సతీష్ కుమార్, మస్తాన్ రావు, దండు పుష్పలత తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com