Logo
Date of Publish : 14 August 2021, 10:11 am
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో 11వ రోజు సేవా కార్యక్రమాలు

                   జనసేన NRI సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా 11వ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 50 మంది మహిళలకు నిత్యావసర సరుకులు అందించారు. జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ గౌరవ సభ్యులు జంగా మూర్తి దాతృత్వంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిరుపేద మహిళలకు ఉచితంగా పంచదార, కందిపప్పు, గోధమపిండి, మినుములు, ఇడ్లిరవ్వ, నూనె, పెద్ద ఉల్లిపాయలు తదితర 9 రకాల నిత్యావసర వస్తువులను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ సిటీ అధ్యక్షుడు పోతిన మహేష్ గారు, ఉపాధ్యక్షుడు వెన్న శివశంకర్, పగడాల లక్ష్మణరావు చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ నిరుపేద మహిళలకు అండగా ఉండేందుకు జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయని, ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్, ఉపాద్యక్షులు శ్రీ పగడాల అంజన్ కుమార్, నాయకులు శ్రీ కంచన శ్రీకాంత్, శ్రీ మాదాసు నరసింహ, దండు చంద్రశేఖర్, జంగా మూర్తిలకు తన అభినందనలు తెలిపారు. కువైట్ లో ఉంటూ మాతృభూమికి, జనసేన బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్న జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ సభ్యులందరూ ఎంతో‌ ధన్యులని, ఈ సందర్భంగా సహాయ దాతకి జంగా మూర్తికి  ప్రత్యేక అభినందనలు తెలిపారు. వెన్న శివ శంకర్ మాట్లాడుతూ ‌కోవిడ్ లాక్ డౌన్ నాటి నుండి నేటివరకూ అవిశ్రాంతంగా సేవలు అందించడం ఎంతో స్ఫూర్తిదాయకం అని ఎన్నారై సేవా సమితి కువైట్ వారి‌ సేవలను కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆలూరి సాంబశివరావు, మైలవరపు కొండలరావు, ఉమ్మడి కృష్ణ, షేక్ మొబినా, అమీర్ భాషా, బాల శెట్టి, వంశీ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com