
జనసేన NRI సేవా సమితి కువైట్ అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన మాసోత్సవాలలో భాగంగా ఓబులవారిపల్లె మండలం వై.కోట గ్రామంలో నిరుపేద మహిళలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిలు ముఖరం చాంద్ గారు, తాతంశెట్టి నాగేంద్ర గారు, కడప జిల్లా లీగల్ సెల్ చైర్మన్ శ్రీ కరుణాకర్ రాజు, పార్టీ నాయకులు మాదాసు నరసింహ విచ్చేశారు. నిరుపేద మహిళలకు ఉచితంగా బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముఖరం చాంద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం, పార్టీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్న జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ సేవలు అభినందనీయం అని అన్నారు. లాక్ డౌన్ సమయంలో కువైట్ నుండి ప్రత్యేక విమానాల ఏర్పాటు చేసి కువైట్ లో నివసిస్తున్న భారతీయులను స్వస్థలాలకు క్షేమంగా చేర్చడం ఎంతో గొప్ప కార్యకమని, ప్రభుత్వాసుపత్రులకి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వివిధ ప్రాంతాలలో మాస్కులు, నిత్యావసర వస్తువులు పంపిణీ స్ఫూర్తిదాయకం అని బాణవతి రామచంద్ర నాయక్, పగడాల అంజన్ కుమార్, దండు చంద్రశేఖర్, కంచన శ్రీకాంత్, మాదాసు నరసింహలను అభినందించారు. రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా సమాజసేవకు, జనసేన అభివృద్ధి కొరకు ఎన్నారైలు చేస్తున్న కార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయమని అన్నారు. ఈ నిత్యావసర వస్తువుల పంపిణీ నిర్వహించినందుకు దాతలు కాంచన శ్రీకాంత్, అల్లం ప్రేమ్ రాయల్, కొమ్మినేని బాల రాయల్, పసుపులేటి రాజేష్, బుర్ర శంకర్, కొండేటి రమేష్, ఆకుల సుమన్, అక్కమ్మ గారి చలపతి, నల్ల శెట్టి పవన్ కుమార్, ఆవుల గణేష్, కొండేటి రమణ గారికి ధన్యవాదాలు తెలిపారు. లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రీ కరుణాకర్ రాజు మాట్లాడుతూ రామచంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో నిర్విరామంగా మూడవ సంవత్సరం కూడా 30రోజులు 30ప్రాంతాలు 30 సేవా కార్యక్రమాలు నిర్వహణ అద్భుతంగా ఉందన్నారు. లీగల్ సెల్ తరపున తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు మాదాసు నరసింహ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను బలంగా ప్రజలలోకి బలంగా ముందుకు తీసుకు వెళ్తున్న జనసేన ఎన్నారై సేవా సమితి సభ్యులందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నాయకులు చవ్వాకుల రెడ్డి మనీ మాట్లాడుతూ అంబేద్కర్, పూలే భావాలను జనసేన పార్టీతోనే సాధ్యమని, పవన్ కల్యాణ్ గారి నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎన్నారైలు మరోసారి రుజువు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమం కోడూరు జనసేన నాయకులు, రాయల్ వై కోట టీం జనసేన నాయకులు చవ్వకుల రెడ్డిమణి, కొండేటి మనోజ్, నల్లంసెట్టి కిషోర్, చాంగల్రాయుడు ఆచారి, ఎర్ర రెడ్డయ్య, పాఠం రవి, నల్లంసెట్టి నరసింహ, కొండేటి సురేష్, అంకిపల్లి హరి, అంకిపల్లి శ్రీను మరియు చిట్వేలి జనసైనికుడు సువారపు హరి రాయల్ తదితరులు పాల్గొన్నారు.