జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ
నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, కత్తెర పల్లి గ్రామంలో ఇద్దరు నడవలేని నిరుపేద లకు జనసేన NRI సేవా సమితి, కువైట్ వారి సహకారంతో జనసేన పార్టీ నెల్లూరు నియోజకవర్గం భాద్యులు మరియు రాయల దక్షిణ కోస్తా జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు యుగంధర్ పొన్న పది వేల రూపాయలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్బంగా యుగంధర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్బంగా రాష్ట్రంలో జరుగుతున్న 30 రోజులు, 30 ప్రాంతాలు, 30 కార్యక్రమాలు భాగంగా ఈ కుటుంబంలో జరుపుకోవడం సంతోషకరమని తెలియజేసారు.విదేశాల్లో ఉన్నప్పటికీ స్వదేశీ మీద ఉన్న మక్కువ, ఏదో చేయాలనే తపన, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో ముడిపడి ఉన్న సేవాతత్పరత ను బట్టి వారి సేవలు అమోఘమని శ్లాఘనీయమైనదని కొనియాడారు. దాత సింగిరి కన్నయ్య గౌరవ ఆద్యుక్షులు వారి కొడుకు నరసింహులు పుట్టినరోజు ఈ రోజు కావడం శుభదినమని హర్షించారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన జనసేన NRI సేవా సమితి కువైట్ అధ్యక్షులు రామచంద్ర నాయక్, ఉపాధ్యక్షులు అంజన్ కుమార్ పగడాల, జనరల్ సెక్రటరీ దండు చంద్ర శేఖర్, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ కంచన శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులు మలిచెట్టి పెంచలయ్య, కొత్త పల్లి శ్రీనివాసులు, మాదాసు నరసింహులు, షేక్ మహ్మద్ గౌస్, తోట చెంగల్ రాయులు, సింగిరి కన్నయ్య, సోషల్ వెల్ఫేర్ కోఆర్డినేటర్ గుంటూరు శంకర్, జాయింట్ సెక్రటరి దండు వేణుగోపాల్, IT సపోర్ట్ దండు సురేష్, కోశాధికారి జిగిలి ఓబులేసులకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో విచ్చేసిన మండల అధ్యక్షులు భాను ప్రకాష్ రెడ్డి, ఉపాధ్యక్షులు విజయ్, నియోజకవర్గం కోఆర్డినేటర్ మెదవాడ రాఘవేంద్ర, మీడియా ఇంచార్జి వెంకటేష్, వెదురుకుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం, మహేష్, సాయి కుమార్, బాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.