అమరావతి, (జనస్వరం) : ఈరోజు ఉదయం మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించాల్సిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని వాయిదా వేయడమైనది. కోవిడ్ వ్యాప్తి ఉధృతంగా ఉన్నందున పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ముందు జాగ్రత్తగా పార్టీ సమావేశాన్ని వాయిదా వేశారు. సంక్రాంతి సంబరాలు మొదలయ్యే సమయంలో కరోనా వ్యాప్తి ఉండటం బాధాకరమని చెబుతూ... ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం జాగ్రత్తలు పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com