మార్కాపురం ( జనస్వరం ) : జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వరద బాధితుల కొరకై నిత్యావసర సరుకులను జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ సిద్ధం చేశారు. ఆయాన మాట్లాడుతూ రాష్ట్రంలో వరదలు వచ్చి సామాన్య ప్రజలు అతులాకుతలం అవుతుంటే ఈ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదాని అన్నారు. జనసేన పార్టీ తరుపున మా వంతు సహాయంగా ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. రైతులు, సామాన్య ప్రజలు ఈ వరదల వల్ల ఎంతో నష్టపోయారని వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, తిరుపతయ్య, పిన్నేబోయిన శ్రీనివాసులు, దుగ్గి రామిరెడ్డి, శిరిగిరి శ్రీను, పోటు వెంకటేశ్వర్లు, ఖజావలి, మధు, మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జన సైనికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com