తిరుపతి ( జనస్వరం ) : జనసేనాని పవన్ కళ్యాణ్ సూచన మేరకు తిరుపతిలో "మన ఊరు-మన ఆట" లో భాగంగా స్థానిక 14వ డివిజన్ లో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు జనసేన నేతలు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి ఆధ్వర్యంలో జరిగిన ఈ ముగ్గుల పోటీల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులు చేసుకునే పెద్ద పండుగ సంక్రాంతి అన్నారు. సంక్రాంతి పండుగను అందరూ ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ "మన ఊరు - మన ఆట" కార్యక్రమాలు చేయాలని సూచించారన్నారు. ప్రతి ఒక్కరిలోని పండుగ సంస్కృతి గొప్పదనం తెలిసే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం "సంక్రాంతి వీర మహిళ" ప్రత్యేక ముగ్గును చూసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధు బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, తిరుపతి నగర ఉపాధ్యక్షులు దినేష్ జైన్, బాబ్జీ, పార్ధు, లక్ష్మి, జిల్లా కార్యదర్శులు ఆనంద్, బాటసారి, ఉమ్మడి చిత్తూరు జిల్లా యువ నాయకులు పగడాల యువరాజ్ రాయల్, నూనె దిలీప్ రాయల్, తిరుపతి నగర కమిటీ సభ్యులు హిమవంతు, మనోజ్ కుమార్, సాయిదేవ్ యాదవ్,హేమంత్, పురుషోత్తం, సాయి కుమార్, గిరిపురం పురుషోత్తం, నవీన్, మధులత, దివ్య, దుర్గ, చందన మరియు జనసేన పార్టీ వీర మహిళలు, తిరుపతి నగర కమిటీ సభ్యులు, వివిధ విభాగాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com