అనకాపల్లి ( జనస్వరం ) : మడుతూరు జంక్షన్ నందు యలమంచిలి గాజువాక రోడ్డు లో వేగ నిరోధకాలు లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతిరోజు ఈ రోడ్డులో కంపెనీలకు సంబంధించి మూడు షిఫ్ట్ లలో కొన్ని వందల బస్సులు మరియు కంపెనీలకు సంబంధించి అనేక లోడులతో పెద్ద పెద్ద లారీలు వెళ్ళుతున్నాయి. గతంలో ఇదే రోడ్డులో జరిగిన ప్రమాదాల్లో సంఘటన స్థలాల్లోనే కొంతమంది మరణించారు. కావున మీరు తక్షణమే ఈ ప్రాంతంలో వేగ నిరోధకాలు ఏర్పాటు చేయావలసినదిగా జనసేన పార్టీ వీర మహిళ మోటూరు శ్రీవేణి ఆధ్వర్యంలో మడుతూరు జనసైనికులు నిరసన తెలిపి తదనాంతరం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అచ్యుతాపురం ఉపేంద్ర గార్కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు నీరుకొండ సంతోష్, పారిపల్లి చంటి, బలిరెడ్డి పూర్ణ, గంధం నానాజీ, మరిశా నాని, శనివాడ నాగు, బొర్రా బాబురావు, మాసారపు చింతల నాయుడు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com