మడుతూరు జంక్షన్ లో వేగ నిరోధకాలు ఏర్పాటు చేయాలని జనసేన ఆధ్వర్యంలో నిరసన

జనసేన

       అనకాపల్లి ( జనస్వరం ) : మడుతూరు జంక్షన్ నందు యలమంచిలి గాజువాక రోడ్డు లో వేగ నిరోధకాలు లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతిరోజు ఈ రోడ్డులో కంపెనీలకు సంబంధించి మూడు షిఫ్ట్ లలో కొన్ని వందల బస్సులు మరియు కంపెనీలకు సంబంధించి అనేక లోడులతో పెద్ద పెద్ద లారీలు వెళ్ళుతున్నాయి. గతంలో ఇదే రోడ్డులో జరిగిన ప్రమాదాల్లో సంఘటన స్థలాల్లోనే కొంతమంది మరణించారు. కావున మీరు తక్షణమే ఈ ప్రాంతంలో వేగ నిరోధకాలు ఏర్పాటు చేయావలసినదిగా జనసేన పార్టీ వీర మహిళ మోటూరు శ్రీవేణి ఆధ్వర్యంలో మడుతూరు జనసైనికులు నిరసన తెలిపి తదనాంతరం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అచ్యుతాపురం ఉపేంద్ర గార్కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు నీరుకొండ సంతోష్, పారిపల్లి చంటి,  బలిరెడ్డి పూర్ణ, గంధం నానాజీ, మరిశా నాని, శనివాడ నాగు, బొర్రా బాబురావు, మాసారపు చింతల నాయుడు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way