రాజంపేటలో ఉన్న పింఛ నదిలోకి భారీగా వరద ప్రవాహం చేరుకోవడంతో నిండుకుండలా మారిన పింఛప్రాజెక్టు. గత కొద్ది నెలల ముందు పింఛా ప్రాజెక్టు తెగిన విషయం తెలిసినదే. అయితే పింఛ ప్రాజెక్టుకు నీటిని నింపడానికి రింగ్ బండ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సామర్థ్యానికి మించి వరదనీరు ప్రాజెక్టులోకి రావడంతో గేట్లను ఎత్తవలసి వస్తున్నదని తహసీల్దార్ భాస్కర్ గారు తెలిపిన ప్రకారం… జనసేన నాయకులు ఆ ప్రాంతాన్ని పరిశిలీంచారు. పింఛ ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల్లోని నివాసీత ప్రాంతాల్లోని ప్రజలు గతాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని, జనసేనపార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర సరుకులు ముందుగా అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. ప్రజలను లోతట్టు ప్రాంతాల నుంచి వెళ్ళేటుగా సహాయ కార్యక్రమాలు చేయాలని కోరారు. రైతులు, గ్రామస్తులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జనసేన నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.