
పాలకొండ, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం కుంబిడి గ్రామంలో గిరిసేన-జనసేన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మత్స.పుండరీకం మాట్లాడుతూ జనసేన- జనవాణి, రైతు భరోసా యాత్ర జనసేన పార్టీ మేనిఫెస్టో క్రియాశీలక సభ్యత్వం గురించి మహిళలకు, యువతకు, పెద్దలకు వివరించారు. గిరిసేన – జనసేన కార్యక్రమంలో ద్వారా ప్రజ దగ్గరకు వెళ్ళి గ్రామంలోని ప్రధాన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేపట్టిన జనసేన – జనవాణి ద్వారా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెల్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. మీ గ్రామ పంచాయతీ నుండి పవన్ కళ్యాణ్ కి సమస్యలతో కూడిన వినతిపత్రం ఇచ్చేందుకు ఒకరు రావాలని మత్స.పుండరీకం కోరారు. కుంబిడి గ్రామ ప్రజలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్ర గురించి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో 3000 మంది కౌలు రైతులు చనిపోయారని, వాళ్ల కుటుంబాలను నేరుగా పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు అందిస్తున్నారు. ఇప్పటికి నాలుగు జిల్లాలో పూర్తి చేసారని అన్నారు, ఇటువంటి నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్ను కోవాల్సిన అవసరం ఉందని మత్స.పుండరీకం కోరారు. జనసేన పార్టీ గురించి, చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి వివరించి ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే వృద్దులతో మాట్లాడుతూ సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. గిరిసేన – జనసేన కార్యక్రమం ద్వారా కుంబిడి గ్రామ ప్రజల కొండల్లో జీవిస్తున్న మాకు మా ఊరి సమస్యలు గురించి తెలుసుకోడానికి వచ్చిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని మత్స. పుండరీకంతో అన్నారు. గ్రామ ప్రజలలో జనసేన పార్టీ పట్ల అపూర్వమైన ఆదరణ ఉందని మత్స.పుండరీకం అన్నారు. ఈ కార్యక్రమంలో కుంబిడి గ్రామ జనసైనికులు వినోద్, నవనీత్, రమేష్, బి. పి. నాయుడు, కంటు రాంబాబు, అన్ను రామకృష్ణ, వావిలిపల్లి నాగభూషన్ తదితరులు పాల్గొన్నారు.