పాడేరు ( జనస్వరం ) : అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా. వంపూరు గాంగులయ్య ఆదేశాల మేరకు గడివలస గ్రామంలో పర్యటించారు. జనసేన పార్టీ పాడేరు మండల అద్యక్షులు నందొలి మురళి కృష్ణ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఎన్నికలు సమీపంలో పర్యటించి ఓట్లు కోసం మాత్రమే ప్రజల దగ్గరకు వచ్చి దొంగ హామీలు ఇస్తున్నారు, తప్ప ప్రజలకు ఉద్దరించింది ఏమి లేదని తెలిపారు. గిరిజన జాతికి న్యాయం చేయలేని అధికారం ఎందుకు, అని గ్రామాల్లో సరైన రోడ్లు సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అలాగే గ్రామంలో భూమి ఎక్కువ ఉంది అని కుంటుశాకులు చెప్తూ పేదలకు పెంక్షన్ తీసేస్తున్నా ఈ ప్రభుత్వాని గద్దె దించే వరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, జనసేన పార్టీ బలోపేతానికి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ మార్పుకి శ్రీకారం చుట్టాలని కోరారు. జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం ఐటీ విభాగం సభ్యులు అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో పర్యటించిన నేపథ్యంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. అనేక మంది యువత ఉద్యోగాలు లేక రైతు పనులకు పరిమితం అవ్వడం భాదకరం అని, యువతకి ఆదర్శంగా నిలబడవలసిన ప్రభుత్వాలు యువతని మోసం చేసిందన్నారు. అలాగే గ్రామాల్లో రోడ్లు సదుపాయాలు లేక ప్రమాదాల బారిన పడుతున్నారు. నిజంగా ఈ ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు అని చెప్పుకుంటున్న అధికారులకు బుద్ధి చెప్పాలంటే జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా!! వంపూరు గాంగులయ్య గారికి ఓటు వేసి గిరిజన అబివృద్దికి ప్రతి ఒక్కరు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కోరారు. అలాగే ఇంత గొప్ప స్వాగతం పలికిన గ్రామస్తులకు ధన్యవాదములు తెలిపారు. అలాగేపాడేరు మండల నాయకులు ముదిలి. సుబ్బారావు మాట్లాడుతూ మన కష్టాలు పోవాలంటే మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలంటే, జనసేన పార్టీ అద్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి ముఖ్యమంత్రి చేసే విధంగా ముందుకు వెళ్ళాలని అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాడేరు మండల అధ్యక్షులు నందోలి. మురళి కష్ణ, జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం ఐటీ విభాగం సభ్యులు సి. హెచ్.అనిల్ కుమార్, పాడేరు మండల నాయకులు, సుబ్బారావు, బూరుగుపుట్టు గ్రామ జనసేన నాయకులు అప్పలరాజు, పాంగి సురేష్, జనసైనికులు బొంజన్న, చిట్టిబాబు, బాలకృష్ణ, ప్రసాద్, రాజు, దివాకర్, గ్రామస్తులు, సిదారి. బోంజన్న, వెంకట్ రావు, అప్పలకొండబాబు, చిరంజీవి, ద్రోణరాజు, రమేష్, సిదారి రమేష్, కళ్యాణ్ వెంకట్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com