
మాడుగుల ( జనస్వరం ) : ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు రాయపు రెడ్డి కృష్ణ, మండలం జనసేన పార్టీ నాయకులు ఉగ్గిన త్రినాధ్ అన్నారు. మండలంలోని చౌడువాడ గ్రామంలో ఇటీవల భావన నిర్మాణ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు భవనం నుంచి కిందపడి గాయాలైన తాపీ మేస్త్రి తుంపాల శంకర్ కు నియోజవర్గ జనసేన పార్టీ నాయకులు సమకూర్చిన 22,600 రూపాయలను శంకర్ ఇంటి వద్ద ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకొనుటకు జనసేన పార్టీ నాయకులు ముందుంటారు అన్నారు. శంకరు వేగంగా కోలుకొని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చీడికాడ మండలం జనసేన నాయకులు జీవి మూర్తి. నాయకులు గుమ్మడి సంతోష్. మజ్జి కృష్ణ. పాలిపోయిన సంతోష్ . రాజి నారాయణమూర్తి. కుంచ మణికంఠ. మారపరెడ్డి శివ. కుంచ అంజిబాబు. నాగులపల్లి మహేష్. రాజ చిన్న నాయుడు. చుక్క నారాయణమూర్తి పాల్గొన్నారు.