మదనపల్లి ( జనస్వరం ) : రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారి యొక్క డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలని ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. అంగన్వాడీలను తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని రాష్ట్రంలో అంగన్వాడీల అందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని కోరుతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షల ఇవ్వాలని వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని మీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు. వర్కర్లకు ప్రమోషన్ ఇవ్వాలని హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలని రాజకీయ జోక్యం అరికట్టాలని అన్నారు. మదనపల్లిలో అంగన్వాడీ యూనియన్ లీడర్ mll హాస్పిటల్ దగ్గర ఉన్న ICDS ఆఫీస్ ముందు మధురవాణి ఆధ్వర్యంలో 500 మంది అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అండ్ వర్కర్స్ సమ్మె చేస్తున్నారు. వారికి సంఘీభావం తెలిపి వారి యొక్క వినతి పత్రాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అందజేసే విధంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి అనిత, స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు సుప్రీమ్ హర్ష, ఉపాధ్యక్షుడు జనసేన సోను, అరవింద్ గని,మంజు, చరణ్, గణేష్, వినయ్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com