భీమవరం పట్టణం లోని 18,19వ వార్డులలో మురుగునీరు నిలిచిపోవడంతో దుర్గంధం వెదజల్లుతూ, ప్రజల అనారోగ్యానికి కారణమవుతోందని అధికారులు పట్టించుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 18,19 వార్డు ప్రజలతో కలిసి అధికారులకు వినతిపత్రం అందించారు. గతంలో చేపట్టిన రోడ్డునిర్మాణం ఎత్తుగా ఉండడం, దానికి అనుగుణంగా డ్రెయినేజి నిర్మాణం లేకపోవడం వల్ల మురుగునీరు నిలిచిపోతుందన్నారు. దీంతో దోమలు,కీటకాలు పెరిగిపోతున్నాయని, అలాగే నిలవవున్న ఈ మురుగునీరు మంచినీటి పైపులలో కలుస్తుండడంతో మంచినీరు తాగడానికి పనికిరాకుండా పోతోందని, దీంతో ఈ వార్డులలోని ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com