
సీతానగరం ( జనస్వరం ) : జనసేనపార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా సీతానగరం జనసేన టీం ఆధ్వర్యంలో “మన సీతానగరం -మన జనసేన ” కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెదభోగిల గ్రామంలో నిర్వహించి ప్రతి ఇంటిఇంటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాల్ని తెలియచేస్తూ జనసేన సిద్ధాంతాల్ని, ఆశయాల్ని వివరించటం జరిగింది. సీతానగరం మండల నాయకులు అల్లు రమేష్ మాట్లడుతూ ప్రజల్లో జనసేన పార్టీ మీద సానుకూల స్పందన ఉందని, ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నామని మరియు కొంతమంది స్వతహాగా వారి సమస్యల్ని పార్టీ కార్యాలయ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. ఈ గ్రామ సమస్యల్ని తొందర్లో ఎలా పరిష్కరించాలో మా ప్రణాళిక రూపకర్తలు, పార్వతీపురం నియోజకవర్గ నాయకులు పైల సత్యనారాయణ, రెడ్డి మణికంఠలతో చర్చించి పరిష్కారం అందిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గ జనసేన నాయకులు అల్లు రమేష్, ఖాతా విశ్వేశ్వరరావు, గణేష్, రాజాన బాలు మరియు సీతానగరం నాయకులు సంతోష్, జై శంకర్, జై ప్రకాష్, జగదీష్, నాయుడు, శ్రావణ్, భాస్కర్, ప్రకాష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.