Logo
Date of Publish : 07 December 2020, 3:24 pm
Editor : Sake Naresh

రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసైనికుడి కుటుంబానికి భరోసా ఇచ్చి, ఆర్థిక సహాయం చేసిన జనసేన నాయకులు

రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసైనికుడి కుటుంబానికి భరోసా ఇచ్చి, ఆర్థిక సహాయం చేసిన జనసేన నాయకులు

           దెందులూరు నియోజక వర్గం పెదపాడు మండలం ఏపూరు గ్రామానికి చెందిన జన సేన పార్టీ క్రియాశీలక కార్యకర్త చింత్రాల రాజేశ్ (రాజా) కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలుసుకొని జనసేన పార్టీ నాయకులు పల్నాటి సాగర్, కోటగిరి వెంకట సుధాకర్, కొఠారు ఆదిశేషు, వీర మహిళ మెంటే సౌజన్య మరియు ఎపూరు విలేజ్ కోఆర్డినేటర్ గేదెల నరేంద్ర రాజా కుటుంబాన్ని పరామర్శించి రాజా కు ఘన నివాళులు అర్పించారు. వారికి జన సేన పార్టీ తరపున ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. రాజా కుటుంబానికి ఏ అవసరం వచ్చినా జన సేన పార్టీ అండగా నిలబడి ఉంటుందని తెలియ చేశారు. ఇటువంటి సంఘటనలు జరిగి చాలా మంది జన సైనికులు చనిపోతున్నారని, వారు డ్రైవింగ్ చేసేటప్పుడు తాగు జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. ఇటువంటి సంఘటనలు చూసి చలించి పోయి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి జన సైనికుడుకి ఇన్సూరెన్స్ సదుపాయం ఉండాలి అని క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి వారికి ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు వచ్చేలా పైలట్ క్రింద ఐదు నియోజక వర్గంలో పూర్తి చేశారని, ఇంకో 32 నియోజక వర్గంలో మొదలు పెట్టారని , త్వరలో దెందులూరు నియోజకవర్గం కూడా ఈ క్రియాశీల సభ్యత నమోదు కార్యక్రమం చేపడతారని తెలియ చేశారు. ఈ కార్యక్రమన్ని జ సైనికులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గం విలేజ్ కోఆర్డినేటర్స్ మరియు జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com