నకరికల్లు ( జనస్వరం ) : మండలంలోని చాగల్లు గ్రామానికి చెందిన షేక్ బాషా షేక్ బేగం దంపతులు గ్రామంలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండగా వారి కుమార్తె షేక్ హసీనాకి వివాహం నిశ్చయం అయింది. వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్న మండల అధ్యక్షులు తాడువాయి లక్ష్మీ, నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావుకి తెలియజేయగా ఆయన ఆర్థికంగా సాయమందించి అండగా నిలబడ్డారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి, వైస్ ప్రెసిడెంట్ షేక్ రఫీ, దూళిపాల దళిత నాయకుడు చిలకా సత్యం, రూరల్ మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వర, షేక్ జానీ పీర్, నకరికల్లు మండలం జాయింట్ సెక్రెటరీ సతకల ఏడుకొండలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com