Logo
Date of Publish : 19 March 2023, 4:17 pm
Editor : Sake Naresh

వైసీపీ కార్యకర్త, గ్రామ సచివాలయ వాలంటీర్ కు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

        రాప్తాడు ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యకర్తకు మరియు వైసిపి కార్యకర్త (గ్రామ సచివాలయ వాలంటీర్), రెండు కుటుంబాలకి అండగా నిలిచిన జనసేన పార్టీ. రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లి మండలం, గంగినేపల్లి గ్రామానికి చెందిన బోయ వినోద్ (జనసేన కార్యకర్త), నాగార్జున (వైసీపీ కార్యకర్త, గ్రామ సచివాలయ వాలంటీర్) ఇద్దరూ 13-జనవరి-2023 వ తేదీన వాల్తేరు వీరయ్య సినిమా చూసి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో నాగార్జున అనే వ్యక్తి మరణించగా వినోద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈరోజు జనసేన పార్టీ చెన్నేకొత్తపల్లి మండల అధ్యక్షులు ఇటికోటి క్రాంతి కుమార్, జనసేన పార్టీ కార్యకర్త వినోద్ కు 7000 రూపాయలు మరియు వైసీపీ కార్యకర్త నాగార్జున కుటుంబ సభ్యులకు 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే వారికి ఎల్లవేళలా జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. ద్విచక్రవాహనంలో వెళ్లే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు చిట్ర రమేష్, లోకేష్ రెడ్డి, రాజశేఖర్, సాకే నాగరాజు, కొక్కంటి పవన్ కుమార్, పండ్ల నారాయణ, విజయ్ కుమార్, జయసింహ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com