కదిరి ( జనస్వరం ) : నియోజకవర్గం NP కుంట మండలం లోని మేకల చెరువు గ్రామానికి చెందిన 28ఏళ్ల వినోద్ గారికి రెండు కిడ్నీలు చెడిపోయి కిడ్నీ దాతలు కోసం సంవత్సర కాలం ఎదురు చూశారు. ఫలితం లేక చివరికి తన భార్య కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆపరేషన్ ఖర్చుకి 4లక్షలు అవసరం అని డాక్టర్లు చెప్పడంతో ఈ విషయం జనసేన నాయకుడు కొట్టి కుమార్ దృష్టికి తీసుకురావడంతో తక్షణమే స్పందించి జనసేన నాయకులతో కలిసి 21,116 రూపాయల సహాయం చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో కేవీ రమణ జనసేన తనకల్లు (మ) అధ్యక్షుడు, షేక్ ఫయాజ్ జనసేన జిల్లా కార్యనిర్వాహకాల కమిటీ చౌదరి శ్రీనివాస్, షేక్ కలేశా, కిరణ్, శ్రవణ్, లక్ష్మణ, మస్తాన్, శ్రీనాథ్, రమేష్, చౌదరి, అనిల్ కుమార్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com