
విజయనగరం ( జనస్వరం ) : పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం, గాదెలవలస గ్రామానికి చెందిన అంపిల్లి లక్ష్మణ్ అనే అథ్లెట్, స్టేట్ లెవెల్ చాంపియన్ తన NIS కోర్స్ నిమిత్తం జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరి మరియు మండల జనసైనికులు శివ, రమేష్, సత్య, NRI వినోద్, సూర్య, వాసు తదితరులందరూకలసి 15000/- ఆర్థిక సాయం చెయ్యడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముందుంటుందని అన్నారు. ఎవరికి ఏం కష్టం వచ్చినా అండగా జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు.