అనకాపల్లి జిల్లా (జనస్వరం) : పాయకరావుపేట మండలం మంగవరం గ్రామానికి చెందిన గాజుల బాలాజీ అనే జనసైనికుడు బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేనపార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి జనసైనికుడిని పరామర్శించి వైద్యనిమిత్తం ఆర్థికసాయం చేశారు. గెడ్డం బుజ్జి మాట్లాడుతూ గాజుల బాలాజీకి అండగా ఉంటామని అన్నారు. అలాగే నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com