
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బాలునికి ఆర్థిక సహాయం చేసిన జనసేన నాయకులు
విశాఖపట్నంలోని జి వి ఎం సి 85 వార్డ్ లో ఉన్నటువంటి ఫార్మాసిటీ కాలనీ కి చెందిన బి ఉద్దేశ్ లుకేమియా ( క్యాన్సర్) తో బాధపడుతున్న మూడు సంవత్సరాల బాలునకు సి ఎమ్ సి, వెల్లూరులో జరుగుచున్న మెడికల్ ట్రీట్మెంట్ నిమిత్తమై కలక్ట్ చేసిన మొత్తం రూ. 1,43,000/- జనసేన పార్టీ పి ఎ సి సభ్యులు & గాజువాక నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ కోన తాతారావు గారు మరియు ఉత్తరాంధ్ర సంయుక్త పార్లమెంటరీ కమిటీ జాయింట్ కన్వీనర్ & గాజువాక నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శ్రీ గడసాల అప్పారావు గార్ల చేతులు మీదుగా జనసేన పార్టీ తరఫున ఫార్మాసిటీ కాలనీలో ఆ బాలుడు ఫ్యామిలీకి నగదు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ కోన తాతారావు గారు మాట్లాడుతూ ఆ బాలుడు త్వరగా కోలుకోవాలని అని ఆకాంక్షించారు , ఈ కార్యక్రమంలో ముఖ్య భూమిక పోషించిన దాసరి రమేష్ బాబును, గవర వెంకటేశ్వరరావును, నేవల్ డాక్ యార్డ్ ఉద్యోగులను మరియు జనసైనికులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గవర సోమశేఖర్ రావు, ముమ్మన మురళి, విందుల చిరు రాజు, అట్టా అప్పారావు, దాసరి త్రినాథ్, దాసరి శ్రీను, దాసరి అచ్యుతరావు, గణేష్, జగదీష్, బలిరెడ్డి అరవింద్, సురేష్ మరియు ఇతర 85 వ వార్డ్ జనసైనికులు పాల్గొన్నారు.