
కొండపల్లి, (జనస్వరం) : కొండపల్లి మున్సిపాలిటీ, కొండపల్లి గ్రామములో దెందుకూరి వాసు బ్రహ్మచారి మరియు వసుంధర దంపతుల కుమార్తె భవాని వివాహం సందర్భంగా వారి కుటుంబానికి అండగా నిలిచారు జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బొలియశెట్టి శ్రీకాంత్ మరియు అయన సతీమణి విజయ దుర్గ. అమ్మాయి తండ్రి వాసు బ్రహ్మచారి మాట్లాడుతూ మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం మాకు ఆర్ధికంగా ఏమీలేదు మీ సహాయం కావాలి అని శ్రీకాంత్ గారిని ఇంటికి వెళ్లి అడిగిన వెంటనే కాదనకుండా 10000/- ఆర్థిక సహాయం అందించారు. వారికి వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపికుంటున్నాను అని అన్నారు. శనివారం నాడు స్వయంగా వారి ఇంటికి వెళ్లి 10000 నగదు ను వారి కుటుంబానికి అందించారు. నిత్యం ప్రజల కోసం వారికి అవసరమైనప్పుడు రాజకీయం, కుల, మత బేధాలకు అతీతంగా సేవ చేస్తున్న బొలియశెట్టి శ్రీకాంత్ దంపతులకు స్థానికుల నుండి ప్రశంసలు అందుతున్నాయి.