
శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట బొడ్డపాడు గ్రామం రోడ్డు పైన ఉన్న వరుస 8 ఇల్లు రాత్రి సుమారుగా11:30 గంటల సమయంలో షార్ట్ సర్కుట్ జరిగి మొత్తం కాలిపోవడం జరిగింది. ఈ విషాద సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రతి ఇంటికి 25 కిలోల రైస్ వంట సామగ్రి మరియు 8మంది వృద్ధులకు 2000 రూపాయలు చెప్పున అందించిన నరసన్నపేట నియోజకవర్గ జనసేన నాయకులు పి. జయరాం (PJR) గారు. ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ అలాగే ప్రతీ బాధితులకు ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేసారు. వారికి ఏం అవసరం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సారవకోట మండల జనసేన నాయకులు కోటి, రామదాసు, ధనుంజేయ, రాజు , సూర్య , క్రాంతి, తేజ, మరియు సారవకోట, జలుమురు మండల కార్యకర్తలు పాల్గొన్నారు.