విజయనగరం ( జనస్వరం ) : జామి మండలం అగ్రహారం గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు. పార్టీ నాయకులు పి.వి.ఆర్.వర్మ గారి సహకారంతో ఈ సరుకులను అందించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, ఎస్.కోట నియోజకవర్గ నాయకులు వబ్బిన సత్యనారాయణ , చోడవరం నియోజకవర్గ నాయకులు సిరపరపు రమేష్ ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్.కోట నియోజకవర్గ నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com