ప్రకాశం ( జనస్వరం ) : ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతున్న జనచైతన్య యాత్రలో వచ్చిన వినతి మేరకు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా జనసేన నాయకులు దేవళ్ళ భాస్కర్ గారి సహకారంతో మూడు కుటుంబలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు మాట్లాడుతూ మేము 47 రోజులు ఇంటి ఇంటికీ ప్రజా సమస్యలు తెలుసుకునేటప్పుడు దానితో పాటు ఇలా చాలా వినతులు వచ్చాయని, దానిలో భాగంగా చాలామందికి మేము మరియు కొంతమంది పెద్దల సహకారంతో చాలా మందికి సహాయం చేశామని అన్నారు. ఇలానే రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వ వైఫల్యాలు మీద ప్రశ్నిస్తామని, ప్రజలకు అండగా కూడా నిలుస్తామని ఒక్కసారి ఆలోచించి ప్రజలు బాగు కోరుకునే జనసేన పార్టీకి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శి గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, వీర మహిళ మాదాసు సాయి నాయుడు, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్, జనసేన నాయకులు జనసేవ శ్రీనివాస్, ఉంగరాల వాసు, నరసింహారావు, యాదల సుధీర్ తదితరులు పాల్గొన్నారు.