Search
Close this search box.
Search
Close this search box.

ఎన్నికల నిర్వహణ సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు రామా శ్రీనివాసులు

• వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదు.

• నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి.

• కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్

        రాయచోటి, ఏప్రిల్ 12 (జనస్వరం) : వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో సాధారణ ఎన్నికల నిర్వహణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు, అంగన్వాడి టీచర్లు పాల్గొనరాదన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోదలిచే రాజకీయ పార్టీల ప్రతినిధులు తప్పనిసరిగా కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలను పాటిస్తూ సంబందిత రిటర్నింగ్ అధికారుల వద్ద అనుమతి పొందాలన్నారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను సంసిద్ధం చేశామని, జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మోడల్ కోడ్ ఉల్లంఘన చర్యలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టడం జరుగుతోందన్నారు. ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ప్రత్యక్ష ఆధారాలతో ఫిర్యాదు చేస్తే వెంటనే విచారించి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అనుమతి లేకుండా ప్రచార కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. పార్టీ అభ్యర్థులు పర్మిషన్ తీసుకున్న ప్రకారమే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. యంసిసి, ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో వ్యూయింగ్ టీం, ఎక్స్పెండేచర్డెచర్ మానిటరింగ్ తదితర టీములు జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి ఫామ్స్ పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 18వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ పగడ్బందీగా పకడ్బందీగా ప్రారంభమవుతుందన్నారు. అభ్యర్థులు నామినేషన్ ఫారాలు సంబంధిత ఆర్వో దగ్గర్నుంచి పొందవచ్చునన్నారు. ఏ రోజు వచ్చిన నామినేషన్ ల డీటెయిల్స్ అదే రోజు నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయడం జరుగుతుందన్నారు. నామినేషన్ల ప్రక్రియను ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అత్యంత పకడ్బందీగా చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు, ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, డిఆర్ఓ సత్యనారాయణ, ఆర్డీవోలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way