పత్తికొండ నియోజకవర్గం, పందికోన గ్రామంలో కొన్నిచోట్ల సీసీ రోడ్లు లేక, కొన్నిచోట్ల సిసి రోడ్లు ఉన్నప్పటికీ కూడా డ్రైనేజీ కాలవలు మట్టి చెత్త చెదారం పేరుకు పోవడం వల్ల మురికినీరు రోడ్డుపై చేరి దుర్వాసన వస్తుందోని స్థానిక జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాకపోకలకు అంతరాయం కలుగుతుందని పందికోన గ్రామ ప్రజలు జనసేన పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సిసి రోడ్లు లేని చోట సిసి రోడ్లు నిర్మించి డ్రైనేజి ఏర్పాటు చేయాలని, కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించి ప్రజలకు రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా దారిలో మురికి నీరు చేరకుండా దుర్వాసన లేకుండా చేయాలని కోరుతూ పనులు వెంటనే మొదలు పెట్టాలని ఎంపీడీవో గారికి మరియు పంచాయతీ సెక్రెటరీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. స్పందించిన అధికారులు త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు నూర్ భాషా ఇస్మాయిల్, తిమ్మప్ప, అనిల్ మరియు తదితరులు పాల్గొన్నారు.
వీటిని కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com