రాజంపేట ( జనస్వరం ) : ఉమ్మడి కడప జిల్లా నందలూరు మండలం నడిగడ్డ గ్రామంలో ఉండే పోకూరి ఆంజనేయ , పోకూరి చిన్నయ్య కుటుంబాలకు జనసేన పార్టి నాయకులు, కార్యకర్తలు, వీరమహిళల సహాకార్యంతో వారి కుటుంబాలకి 75,000/- ఇవ్వడం జరిగింది. నందలూరు మండల జనసేన యువ నాయకులు ప్రశాంత్ భారతాల గారు మాట్లాడుతూ ప్రజల బాగోగుల కోసం ప్రజల సంక్షేమం కోసం పుట్టిన పార్టి జనసేన పార్టి అని తన గ్రామం లో సభ్యత్వం తీసుకుని పార్టి కోసం అహర్నిశలు కష్టపడే జనసైనికుడి కుటుంబానికి రాజంపేట నాయకుల సహకారంతో ఆర్ధిక సహాయం చేయడం గొప్ప పరిణామం మరియు గొప్ప విషయం అని పేర్కొన్నారు. మలిశెట్టి వెంకట రమణ గారి ఆదేశాల మేరకు ప్రజా బాట కార్యక్రమం 99వ రోజు ఘనంగా ప్రశాంత్ భారతాల గారి ఆధ్వర్యం లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన వారు ఎం . వెంకటేశ్వరావు ,లీగల్ సెల్ కత్తి సుబ్బారాయుడు, రాటాల రామయ్య, వీరమహిళా రెడ్డి రాణి, రైల్వే కోడూరు నాయకులు వర్ధనగారి ప్రసాద్, మర్రిరెడ్డి ప్రసాద్ , శ్రీధర్ ,మని , అనంతరాయులు, రామ శ్రీనివాస్ ,నందలూరు మండల నాయకులు తిప్పాయపల్లి ప్రశాంత్, మస్తాన్, ఎల్కచర్ల హరి, ఈశ్వర్, గోపికృష్ణ, భాస్కర్ పంతులు , పోకూరి నరేష్ , పోకూరి మల్లికార్జున, మిరియం నాని మొదలగు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com