ప్రకాశం ( జనస్వరం ) : మద్దిపాడు మండలం, పెద్ద కొత్తపల్లి ఎస్సీ కాలనీకి చెందిన జనసేన పార్టీ కార్యకర్తకి ఆక్సిడెంట్ జరిగింది. అతనికి రెండు సర్జరీ లు చెయ్యాల్సి రాగా ఆరోగ్యశ్రీ వర్తించదని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఆర్ధికంగా పేదవారు కావటంతో తెలిసిన వెంటనే స్పందించిన స్థానిక నాయకులు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు కందుకూరు బాబు, మద్దిపాడు మండల అధ్యక్షులు నున్నా బాలసుబ్రమణ్యం, అంగలకుర్తి నరసింహారావు, పొన్నం అయ్యప్ప కలసి చికిత్స నిమిత్తం 15000 రూ. సమకూర్చారు. ఆ మొత్తాన్ని రాష్ట్ర జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ చేతుల మీదుగా అందించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com